in

‘balagam’ Kavya Shuts Down Rumors Of Being ‘Body-Shamed’!

గంగోత్రి సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ పిల్లి కళ్ల పాప మసూద సినిమా ద్వారా హీరోయిన్ గా తన జర్నీ స్టార్ట్ చేసింది. బలగం సినిమా ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన కావ్య హీరోయిన్ గా ట్రై చేస్తున్న రోజుల్లో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పిందంటూ వచ్చిన కథనాలపై క్లారిటీ ఇచ్చింది కావ్య కళ్యాణ్ రామ్ తనకు అలాంటి అనుభవాలు ఎదురవ్వలేదని, ఆ కథనాల్లో వచ్చినట్లుగా ఏ డైరెక్టర్ తనని బాడీ షేమింగ్ చేయలేదని స్పష్టం చేసింది.

తాను చేయని, తనకు సంబంధం లేని వ్యాఖ్యలతో పలు మీడియా హౌస్ లు కథనాలు ప్రచురించాయని, వాటిల్లో వాస్తవం లేదని, ఏ డైరెక్టర్ నుండి తనకు బాడీ షేమింగ్ సమస్య ఎదురు కాలేదని స్పష్టం చేసిన కావ్య ఇక మీదట ఇలాంటి అసత్య ప్రచారాలు చేయద్దని ట్వీట్ ద్వారా మీడియా హౌస్ లకు విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో కావ్యపై వచ్చిన కథనాలు నెట్టింట వైరల్ అయ్యాయి. బలగంతో బ్లాక్ బస్టర్ అందుకున్నప్పటికీ కావ్యకి ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదని చెప్పాలి..!!

mrunal thakur missed her dream project in telugu?

TRAGIC END OF A LADY COMEDIAN!