in

baby’s Big Break, Dil Raju Production and More?

బేబీ’ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది హీరోయిన్ వైష్ణవి. మొదటి సినిమాతోనే ఆడియన్స్ ను తన యాక్టింగ్ తో మెస్మరైజ్ చేసింది. దీంతో అమ్మడుకి అందరూ ఊహించినట్టే తెలుగులో ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా దిల్ రాజు ప్రొడక్షన్స్ లో ఆశిష్ హీరోగా తెరకెక్కుతున్న ‘లవ్ మీ’ సినిమాకు వైష్ణవి హీరోయిన్ గా తీసుకున్నారు. అలాగే బోమమరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో సిద్దు జొన్నలగడ్డ కాంబో సినిమాకు కూడా వైష్ణవి ను అనుకుంటున్నారు. అల్మోస్ట్ ఈ సినిమాకు కూడా హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టే.

ఇక వైష్ణవి తాజాగా మరో మూడు కథలు విని ఆ ప్రాజెక్ట్స్ కి కూడా సైన్ చేసిందని తెలుస్తుంది. అంటే బేబీ క్రేజ్ తో వైష్ణవి ఇప్పుడు చిన్న సినిమాలకు మీడియం రేంజ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అవుతుంది. ఇక కృతి శెట్టి , శ్రీలీల లానే మొదటి సినిమా తర్వాత తెలుగులో బిజీ కాబోతుంది వైష్ణవి. కానీ కృతి శెట్టిలా వచ్చిన క్రేజ్ ను తగ్గించుకుంటుందా ? లేదా శ్రీలీల ళా వరుస సక్సెస్ తో ఇంకా డబుల్ క్రేజ్ పొందుతుందా ? అనేది వైష్ణవి ఎంచుకునే సినిమాలు , పాత్రలు బట్టి ఉంటుంది. ఏదేమైనా బ్లాక్ బస్టర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి యంగ్ హీరోయిన్ మంచి క్రేజ్ సొంతం చేసుకొని బిజీ హీరోయిన్ అవ్వబోతుంది.

jhanvi kapoor rejects telugu special song offer?

kriti sanon taking special care about her sister Nupur!