in

Baahubali: Before The Beginning, Nayanthara Roped In For A key Role?

టాలీవుడ్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సిరీస్ సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. బాహుబలి సిరీస్ వల్ల ప్రభాస్ తో పాటు ఈ సినిమాలో నటించిన నటీనటులకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ బాహుబలి బిఫోర్ బిగినింగ్ పేరుతో తొమ్మిది భాగాలుగా వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నట్టు గతంలోనే కీలక ప్రకటన చేసింది. ప్రవీణ్ సత్తారు, దేవా కట్టా ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ వెబ్ సిరీస్ లో శివగామి పాత్రలో వామిక గబ్బి నటిస్తున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ లో శివగామికి ధీటుగా ఉండే ఒక పవర్ ఫుల్ పాత్రలో నయనతార నటిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సెప్టెంబర్ నెల నుంచి ఈ వెబ్ సిరీస్ షూటింగ్ లో నయనతార పాల్గొననున్నారని వార్తలు వస్తుండటం గమనార్హం. అయితే నయన్ ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన రావాల్సిఉంది.

i used to work in a fast-food center before : vijay sethupathi

ananya pandey glamorous pics sitting on a sofa!