in

Avika Gor turns producer with untitled Telugu film!

యంగ్ హీరోయిన్ అవిక గోర్ ఇప్పుడు సినీ ప్రొడ్యూసర్ గా మారింది. ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరోయిన్.. ‘ఉయ్యాల జంపాల’ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత ‘సినిమా చూపిస్త మావా’ వంటి సినిమాలలో నటించింది. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు తెలుగు సినిమాల్లో నటిస్తున్న అవిక.. తాజాగా నిర్మాతగా మారుతూ ‘అవికా స్క్రీన్స్ క్రియేషన్స్’ అనే సంస్థను నెలకొల్పింది. భోగేంద్రగుప్తా మడుపల్లితో కలసి ఓ సినిమాను నిర్మిస్తోంది. మురళీ నాగ శ్రీనివాస్ గంధం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సాయిరోనక్, అవికా గోర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీని గురించి అవిక చెబుతూ, ‘చిన్నప్పటి నుంచీ టీవీ, సినిమా రంగంలోనే వున్నాను. అన్నీ చూస్తున్నాను.. సినిమా నిర్మాణం గురించి తెలుసు.. అందుకే నిర్మాతగా మారాను’ అని చెప్పింది.

​Pooja Hegde Buys a Sea-facing Apartment in Bandra!

11 years for leader!