in

​Pooja Hegde Buys a Sea-facing Apartment in Bandra!

సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకూ ఎవరికైనా ఉండే కామన్‌ కోరిక ఇంటిని కట్టుకోవాలి. వారి వారి స్థోమత, స్థాయికి తగ్గట్లు సొంతింటిని నిర్మించుకోవాలని లేదా కొనుగోలు చేయాలని చూస్తుంటారు. తమకంటూ ఓ ఇంటిని నిర్మించుకుంటేనే లైఫ్‌లో సెటిల్‌ అయ్యామని భావిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా అందాల భామ పూజాహెగ్డే కూడా తన సొంతింటి కలను నెరవేర్చుకుంది. ‘ఒక లైలా కోసం’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ అందాల తార అనతి కాలంలోనే అగ్ర కథానాయికల్లో ఒకరిగా గుర్తింపు సంపాదించుకుంది.

వరుస సినిమాలకు సైన్‌ చేస్తూ బడా స్టార్‌ల సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంటూ దూసుకెళుతోంది. ఇక రెమ్యునరేషన్‌ను కూడా పెంచేసిన ఈ ‘బుట్టబొమ్మ’ తాజాగా ఓ ఇంటిది అయ్యింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని స్కైలైన్‌ వ్యూలో ఉన్న 3బీహెచ్‌కే అపార్టమెంట్‌ను కొనుగోలు చేసిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇంటీరియర్‌ పనులు జరుగుతున్నాయని, ఈ పనులను పూజా దగ్గరుండి మరీ చూసుకుంటోందని సమాచారం. అత్యంత ఖరీదైన ఏరియాలో పూజా కొనుగోలు చేసిన ఈ అపార్డ్‌మెంట్‌ విలువ రూ.కోట్లతో ఉంటుందని టాక్‌. ఇదిలా ఉంటే పూజా ప్రస్తుతం ‘రాధే శ్యామ్‌’, ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’, సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

rgv’s heroine apsara rani special song in gopichand’s next!

Avika Gor turns producer with untitled Telugu film!