Amid Russian invasion, Samantha hails Ukraine’s President Zelensky!
ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం గురించే మాట్లాడుకుంటున్నాయి. ఈ యుద్ధం వల్ల ఇతర దేశ ప్రజలు కూడా ఇబ్బందులు పడడం వల్ల దీనిపై సామాన్యుల దృష్టి కూడా పడింది. రష్యా చర్యలకు ఉక్రెయిన్ సతమతమవుతోంది కాబట్టి చాలామంది ఆ దేశ మంచి గురించి కోరుకుంటున్నారు. ఇదే క్రమంలో సమంత కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీపై ప్రశంసలను కురిపించారు. సినీ విషయాల గురించే కాదు.. సామాజిక అంశాలు, తనను కదిలించే పలు [...]











