in

sunil announced 2 Movies On The Occasion Of His Birthday!

స్టార్ కమెడియన్ గా ఎంట్రీ తనదైన టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు సునీల్. ఆతర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్న సినిమాతో  హీరోగా మారారు. మంచి హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు. ఆతర్వాత పూల రంగడు సినిమాలో సిక్స్‌ ప్యాక్‌ కూడా చేశాడు. ఇది కూడా మంచి విజయం సాధించింది. అయితే ఆ తర్వాత   చేసిన సినిమాలు మాత్రం మిశ్రమ ఫలితాలు అందుకున్నాయి. వరుస ప్లాఫులు ఎదురయ్యాయి..అయితే హీరోగా తన ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు ఈ నటుడు.

తాజాగా తన పుట్టిన రోజును పురస్కరించుకుని తను హీరోగా నటిస్తున్న రెండు కొత్త చిత్రాల పోస్టర్స్ ను విడుదల చేశాడు సునీల్‌.. అందులో ఒకటి ‘ బుజ్జీ ఇలారా’ అయితే.. మరొక సినిమా ‘కుంభకర్ణ’. ఈ రెండు చిత్రాల్లోనూ విభిన్నమైన గెటప్స్ తో కనిపించాడు సునీల్‌. కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ‘ బుజ్జీ ఇలారా’ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో సునీల్ పోలీసాఫీసర్ గా నటిస్తున్నాడు. అలాగే కొత్త దర్శకుడు అభిరామ్ దర్శకత్వంలో ‘కుంభకర్ణ’ రూపొందుతోంది. ఇందులో సునీల్ సూరజ్ దేవ్ అనే పాత్రను చేస్తున్నాడు. మరి ఈ రెండు సినిమాలతోనైనా సునీల్ మళ్లీ హీరోగా బిజీ అవుతాడేమో చూడాలి.

Rashmika mandanna Responds To Marriage With Vijay Deverakonda!

Payal Ghosh at Sanket Enterprises 25 Years Celebrations!