in

Anushka Shetty is set to tie the knot with a Dubai businessman!

పెళ్లి పీటలు ఎక్కుతున్న అనుష్క!
ఓవైపు గ్లామరస్‌ పాత్రలు చేస్తూనే మరోవైపు నటనకు ప్రాధాన్యమున్న రోల్స్‌ చేస్తూ మంచి పేరు సంపాదించింది. ‘అరుంధతి’ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన ఈ భామబాహుబలి’ ప్రాంఛైజీతో గ్లోబల్‌ స్టార్‌ డమ్‌ సంపాదించుకుంది. ‘బాహుబలి’ తర్వాత సినిమాలు తగ్గించిన స్వీటీ మరి పెండ్లి పీటలెక్కేదెప్పుడంటూ సోషల్‌ విూడియాలో చాలాకాలంగా చర్చ నడుస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

దుబాయ్‌ కు చెందిన వ్యాపారవేత్తతో అనుష్క పెళ్లి
తాజాగా దీనికి సంబంధించిన వార్తే నెట్టింట రౌండప్‌ చేస్తోంది. ఈ భామ త్వరలోనే ఇక ప్రొఫెషనల్‌ లైఫ్‌కు బ్రేక్‌ ఇచ్చి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతుందట. తాజా టాక్‌ ప్రకారం అనుష్క దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్తతో ఏడడుగులు వేయనుందట. అనుష్క కుటుంబసభ్యులు ఈ సంబంధాన్ని కుదిర్చారని, తల్లిదండ్రుల పెండ్లి ప్రతిపాదనకు అనుష్క గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసిందని వార్తలు వస్తున్నాయి. గతేడాది ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ సినిమాతో ప్రేక్షకుల ముందు కొచ్చింది అనుష్క. నవీన్‌ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది..!!

tripti dimri Recalling her initial days in the industry!

Trivikram all praises on actress Samantha!