in

Anupama Parameswaran opens up about her first lip kiss!

ప్పటికప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి టాలెంట్ కలిగిన యంగ్ హీరోయిన్స్ వస్తూనే ఉంటారు. ఈ ప్రక్రియ ప్రతి నాలుగైదు ఏళ్ళకి జరుగుతూనే ఉంటుంది. మరి అలా కొన్ని సంవత్సరాల కితం టాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.. అయితే కొంతమంది హీరోయిన్స్ ఎక్స్ పోజింగ్ కి గాను అలాగే ఈ లిప్ లాక్ వంటి వాటికి దూరంగా ఉంటారని ఓ లిస్ట్ ఉంది. మరి అందులో అప్పుడు నుంచే అనుపమ పేరు కూడా యూత్ చేర్చేసారు.

కానీ ఊహించని విధంగా అనుపమ తన లేటెస్ట్ సినిమా “రౌడీ బాయ్స్” చిత్రంలో మొట్ట మొదటి సరిగా అనుపమ లిప్ లాక్ చెయ్యడం ఇండస్ట్రీ వర్గాల్లో మంచి సెన్సేషన్ ని రేపింది. ముఖ్యంగా అయితే యూత్ అనుపమ ఫాలోవర్స్ షాక్ అయ్యారు. హీరో ఎవరో తెలియకుండా అనుపమ ఎంత వరకు వెళ్తుంది అనుకునేవారికి మాత్రం ఊహించని షాక్ ఈమె ఇచ్చింది. మరి అసలు ఇంతలా సెన్సేషన్ రేపిన ఈ సీన్ పై అనుపమ సింపుల్ గానే రియాక్షన్ ఇచ్చింది. ఈ సినిమాకి ఇది అవసరం అనిపించింది అందుకే చేసేసాను అని ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ని సింపుల్ గా చెప్పేసింది. దీనితో ఈ యంగ్ హీరోయిన్ కూడా ఇక మీద నుంచి హాట్ షో ఇవ్వడం కన్ఫర్మే అనుకోవాలి..

breaking : Mohan Babu announces Mohan Babu University!

Telugu Actress Surabhi Stills in short white dress!