అమితాబ్ బచ్చన్, లెజెండరీ యాక్టర్, భారత దేశం లో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లిన పరిచయం అవసరం లేని పర్సనాలిటీ. అటువంటి అమితాబ్ బచ్చన్ ను గేట్ బయట నిలబెట్టాడు ఒక సెక్యూరిటీ గార్డ్, ఏమిటండి మీరు చెప్పేది నమ్మదగిందిగ లేదు అంటారా, నిజమండి బాబు, ఈ సంఘటన మన హైదరాబాద్ లోనే జరిగింది. “హమ్ జహ ఖడే హోతే వాహసే లైన్ షురూ హోజాత” అని ధీమాగా చెప్పిన అమితాబ్ ని గేట్ బయట నిలబెట్టాడు ఓ సెక్యూరిటీ గార్డ్. ప్రభాస్ తో కలసి” ప్రాజెక్ట్ కె” షూటింగ్ లో బిజీ గ ఉన్న అమితాబ్ అన్నపూర్ణ స్టూడియో సెవెన్ ఎకర్స్ లో షూటింగ్ లో పార్టిసిపేట్ చేయటానికి వెళ్లారట. గేట్ దగ్గర కార్ ఆపిన సెక్యూరిటీ ఓ.టి.పి. చెప్పమన్నాడట,” ఓ.టి.పి. నహి హై అందర్ బచ్చన్ సహాబ్ హై” అన్నాడట డ్రైవర్.”
అదంతా జాన్తా నై”, అన్నాడట సెక్యూరిటీ గార్డ్. ఇదంతా చూస్తున్న అమితాబ్ గారు కార్ అద్దం దింపి తన ఫేస్ చూపించి,” చోడో యార్” అన్నారట, నహి ఛోడూంగా, రూల్స్ ఒప్పుకోవు అన్నాడట అతను. సెక్యూరిటీ గార్డ్ పట్టు వీడకపోవటం తో చేసేది లేక “కమాల్ హై యార్” అని అక్కడ నుంచి వెనకకు తిరిగి వెళ్లిపోయారట అమితాబ్. సెక్యూరిటీ గార్డ్ సిన్సియారిటీ ని మెచ్చుకోవాలా?, లేక అతని మొండితనాన్ని చూసి” ఒడియమ్మ బడవ! ఏందయ్యా ఇది నేను యాడ సూడ్ల!!” అనుకోవాలా?. ఇంతకీ ఈ సెక్యూరిటీ గార్డ్ చేసింది రైటా? రాంగా?, కొన్ని సంఘటనలు ఎంతటి వారిని అయినా ధర్మ సంకటంలో పడేస్తాయి అనటానికి ఇదొక చక్కటి ఉదాహరణ..!!