in

anchor anasuya roped in for ravi teja’s khiladi’!

తెలుగు బుల్లితెర అభివృద్ధి చెందుతున్న త‌రుణంలో గ్లామ‌ర్ హంగులు అద్దిన తెలుగు యాంక‌ర్స్‌లో అన‌సూయ ముందు వ‌రుస‌లో ఉంటారు. క్రమంగా ఈ హాట్‌ యాంక‌ర్ ఇమేజ్ బుల్లితెర నుండి వెండితెర‌పై కూడా అడుగు పెట్టారు. ప‌లు చిత్రాల్లో కీల‌క పాత్ర‌లు, స్పెష‌ల్ సాంగ్స్‌లో న‌టించారు. అన‌సూయ న‌టించిన చిత్రాల్లో క్ష‌ణం, రంగ‌స్థ‌లం సినిమాల్లో అన‌సూయ పోషించిన పాత్ర‌ల‌కు చాలా మంచి పేరు వ‌చ్చింది. ఇప్పుడు ద‌ర్శ‌క నిర్మాత‌లు అన‌సూయ‌ను దృష్టిలో పెట్టుకుని పాత్ర‌ల‌ను క్రియేట్ చేస్తున్నారు.

తాజా స‌మాచారం మేర‌కు అనసూయ మాస్ మ‌హారాజా ర‌వితేజ 67వ చిత్రం ‘ఖిలాడి’లో చంద్ర‌క‌ళ అనే కీల‌క పాత్ర‌ను పోషించ‌నుంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. మరి ఈ పాత్రకున్న ప్రాధాన్యత ఏంటో తెలియాలంటే విడుదల వరకు ఆగాల్సిందే. క్రాక్ సినిమా త‌ర్వాత ర‌వితేజ చేస్తున్న ఈ సినిమాకు ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌కుడు. చిత్రాన్ని జయంతి లాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ బ్యానర్స్‌పై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు.

nithya menen gives green signal to telugu web series!

HEROINE LOCKED FOR BALAKRISHNA – BOYAPATI FILM!