in

anchor anasuya doesn’t mind going for a third child!

థ్యాంక్ యు బ్రదర్’ ఫస్ట్ లుక్ పోస్టర్లో నిండు గర్భంతో కనిపించి ఆశ్చర్యపరిచింది అనసూయ. దీని పట్ల అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే అనసూయ మాత్రం ఆ పాత్ర చేయడంలో తనకెలాంటి అభ్యంతరాలు లేవని అంటోంది. సినిమాలోనే కాదు.. నిజ జీవితంలో కూడా మళ్లీ గర్భవతిని కావడానికి తనకు అడ్డంకేమీ లేదని.. మూడో బిడ్డను కనడానికి తాను సిద్ధమని ప్రకటించడం విశేషం. గర్భవతిగా ఉన్నపుడు అందరూ తనను అందరూ ఎంత బాగా చూసుకున్నారో గుర్తుందని, ఆ గారాబం తనకెంతో నచ్చుతుందని,

అందుకే నిజ జీవితంలో మరోసారి గర్భవతిని కావడం తనకిష్టమే అని ఆమె అంది. ఇద్దరు పిల్లల్ని కన్న తనకు మాతృత్వంలో ఉన్న అనుభూతి ఎలాంటిదో తెలుసని, అందుకే ‘థ్యాంక్ యు బ్రదర్’ సినిమాతో బాగా కనెక్ట్ అయ్యానని అనసూయ చెప్పింది. రమేష్ రాపర్తి అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రంలో అనసూయ సోదరుడి పాత్రలో ‘మనసానమ:’ షార్ట్ ఫిలిం ఫేమ్ అశ్విన్ విరాజ్ నటిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.

21 years for ‘nee kosam’!

RAJINIKANTH FINALLY Announces POLITICAL ENTRY!