in

anasuya turns item girl for pushpa?

ష్యాలో పుష్పకు పెద్దగా రెస్పాన్స్ లేక డీలా పడ్డ ఫ్యాన్స్ కు పుష్ప 2 నుంచి మాంచి కిక్ ఇచ్చే వార్త ఒకటి బయటకు వచ్చింది. తన ప్రతి సినిమాలోనూ ఐటమ్ సాంగ్ కు పెద్ద పీట వేసే సుకుమార్ ‘ది రైజ్ ఆఫ్ పుష్ప’లో దాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకుని వెళ్లాడు. ఇప్పుడు రెండవ భాగానికి ఏకంగా రంగమ్మత్తనే రంగంలోకి దింపాలని ఫిక్స్ అయ్యాడట. పార్ట్ 1 లో సమంత అదిరిపోయే స్టెప్పులేసి ‘ఊ అంటావా మామ’ సాంగ్ ను ఆద్యంతం రక్తి కట్టించింది.

ఇప్పుడు రెండవ భాగంలో మరింత డోస్ పెంచేలా ప్లాన్ చేస్తున్నాడట సుక్కు. అయితే దీనికి అందాల రంగమ్మత్త అదేనండి మన అనసూయ అయితేనే పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యాడట. ఈ మేరకు రెండవ భాగంలో అనుసూయ పాత్ర నిడివిని కాస్త పెంచబోతున్నారని కూడా తెలుస్తోంది. అది కూడా ఓ రేంజ్ లోనే ఉండబోతోందట. ఈ పాట సినిమాకే హైలైట్ గా నిలిచే అవకాశం లేకపోలేదు. ఇంకే ముంది అమ్మడు తెలుగు రాష్ట్రాలను తన అందాలతో ఒక ఊపు ఊపేయడం ఖాయం అని అర్థమవుతోంది..!!

Yashika Anand Hot Pics In Floral Green Lehenga!

I shouldn’t have missed Arjun Reddy – Parvati Nair regrets!