in

anasuya in for Pawan-Krish movie?

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]జ[/qodef_dropcaps] నసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళి ముఖానికి రంగు వేసుకోబోతున్న సంగతి తెలిసిందే.. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు సినిమాలు సైన్ చేసారు పవర్ స్టార్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ప్రస్తుతం పింక్ తెలుగు రీమేక్ లో నటిస్తున్న పవన్ ఆ తరువాత క్రిష్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ మూవీ ఇంకా ‘గబ్బర్ సింగ్’ డైరెక్టర్ హరీష్ శంకర్ తో మరో మూవీ చేస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం పవన్ – క్రిష్ సినిమా లో జబర్దస్త్ అందగత్తె అనసూయ ఒక కీలక పాత్రా చేస్తున్నట్లుగా సమాచారం.. ఇందులో తన రోల్ దాదాపు 30 నిమిషాల పాటు ఉండబోతోందట. చిత్ర యూనిట్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ అనసూయ ఫ్యాన్స్ మాత్రం తెగ సంబర పడిపోతున్నారు. ‘రంగస్థలం’, ‘సోగ్గాడే చిన్ని నాయన’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి బుల్లి తెర మీదే కాదు వెండి తెర మీద కూడా ఆకట్టుకున్న అనసూయ నిజంగా పవన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసుంటే ఇంకా టాలీవుడ్ లో తన దశ తిరిగినట్లే అనుకోవాలి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందొ తెలియాలి అంటే ఇంకొంత కలం వేచి ఉండక తప్పదు..

Mohan babu to play a crucial role in chiru- koratala movie?

Mahesh to play a gangster role in his next!