in

Anasuya about divorce rumors!

నసూయ, భరద్వాజ్ దంపతులు తమ దాంపత్య జీవితాన్ని పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు జవాబులిస్తుంది అనసూయ. ఈ చాటింగ్ లో భాగంగానే తనకు సుశాంక్‌ భరద్వాజ్‌తో మధ్య ఏర్పడిన ప్రేమ గురించి చెప్పుకొచ్చింది అనసూయ. 16 ఏళ్ల వయసులోనే తాను అతడి ప్రేమలో పడ్డానని, తమ ప్రేమ ఎన్సీసీ క్యాంపులో మొదలైందని.. ఆ టైంలో తనకు ప్రేమ, ఎఫైర్స్ లాంటి వాటిపై నమ్మకం లేదని.. అందుకే సరైన నిర్ణయం తీసుకోడానికి చాలా సమయం పట్టిందని చెప్పుకొచ్చింది అనసూయ. ఆ తర్వాత ఒకర్నొకరు అర్థం చేసుకున్న తర్వాత ఇంట్లోవాళ్ళు పెళ్లికి ఒప్పుకోకపోతే తానే చాలాసార్లు బయటికి వెళ్లి పెళ్లి చేసుకుందామని బలవంతపెడితే.. అలాంటి పెళ్లికి గౌరవం ఉండదని భరద్వాజ్ చెప్పడంతో తానే కూల్ అయ్యానని.. ఆ తర్వాత తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాతే అందర్నీ ఒప్పించి పెళ్లి చేసుకున్నామని చెప్పుకొచ్చింది ఈమె.

ఈ చాటింగ్ లోనే ఓ అభిమాని.. ‘మీ ఇద్దరి మధ్య గొడవలు రాలేదా.?’ అనడిగిన ప్రశ్నకు కూడా జవాబిస్తూ.. ‘ఎందుకు రాలేదు.. చాలాసార్లు గొడవపడ్డాం. వారానికోసారి ఏదో విషయంపై గొడవ పడుతూనే ఉంటామని, అందుకే ప్రతి వారం విడాకులు తీసుకుంటాం.. కానీ అంతలోనే కలిసిపోయి విడాకులను పెడాకులు చేసి విసిరేస్తామని నవ్వుతూ చెప్పుకొచ్చింది అనసూయ. చదివారు కదా.. నమ్మకం వున్నచోట ప్రేమ వుంటుంది. ప్రేమ వున్నచోట సర్దుకుపోయే మనస్తత్వం వుంటుందని థమ దాంపత్య జీవితంలోని సరదా సంఘటనలను ఎంత చక్కగా వివరించిందో కదా మన రంగమ్మత్త. ఈ ఫ్యామిలీ టిప్స్ మీకు నచ్చితే మరి మీరూ ఫాలో అయిపోండిక..

payal grabs a crazy offer!

vote for the worst movies done by our star heroes!