in

Amitabh Bachchan roped in for prabhas next!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మహానటి ఫేం నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఇది ప్రభాస్ కి 21వ చిత్రం కావడం విశేషం.. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌ పై సీ అశ్వనీదత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్ రాబోతుంది అంటూ నిన్న చిత్ర యూనిట్ వెల్లడించిన సంగతి తెలిసిందే.. అనుకున్నట్టుగానే ఎవరు ఉహించని సప్ రైజ్ ని ఇచ్చేసింది..

ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటిస్తున్నట్టుగా వెల్లడించింది. ” ఇలాంటి లెజెండ్ లేకుండా మేము లెజెండ్ లాంటి సినిమాను ఎలా తీయగలం” అని చిత్ర యూనిట్ వెల్లడించింది. ప్రభాస్ సినిమాలో అమితాబ్ అనగానే సినిమా పైన అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. “కోట్లాది భారతీయులకు గర్వకారణమైన నటుడిని మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు మా ప్రయాణం మరింత పెద్దదయింది” అని వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది.

raghavendra rao to announce his new film tomorrow!

jr ntr’s message for social media users!