కెరీర్ తొలినాళ్లలో రాంచరణ్, నాగచైతన్య లాంటి స్టార్ కిడ్స్ తో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది మలయాళ భామ అమలాపాల్. ఆ తర్వాత కొన్ని సినిమాలే చేసిన అమలాపాల్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తో తాను ఎక్కువగా కనెక్ట్ కాలేదని అంటోంది. టాలీవుడ్‌లో నెపోటిజమ్ అంశాన్ని ప్రస్తావిస్తూ..తన స్వీయ అనుభవాలను చిట్ చాట్ సెషల్ లో షేర్ చేసుకుంది..‘నేను తెలుగు ఇండస్ట్రీకి వెళ్లినపుడు అక్కడ ఫ్యామిలీ కాన్సెప్ట్ ఉందని తెలుసుకున్నా. అక్కడ వారి కుటుంబాలు, వారి అభిమానుల ఆధిపత్యం ఎక్కువ. ఆ సమయంలో వారు తీసే సినిమాలు చాలా డిఫరెంట్‌గా ఉండేవి. అంతేకాదు ఎప్పుడూ ఇద్దరు హీరోయిన్లుండాల్సిందే.
ప్రేమ సన్నివేశాలు, పాటలు, ఇలా ప్రతీ ఒక్కటి చాలా గ్లామరస్‌గా ఉండేవాటి కోసం మేమక్కడ ఉండాల్సి వచ్చేది. టాలీవుడ్‌లో కమర్షియల్ సినిమాలుండేవి..ఆ సమయంలో తెలుగు ఇండస్ట్రీతో ఎక్కువ కనెక్ట్ అవ్వలేకపోయా. అందుకే కొన్ని సినిమాలే చేశా’నంది..‘అదృష్ణవశాత్తు నా డెబ్యూ తమిళ సినిమాతో ఇచ్చా. నేను వచ్చినపుడే దర్శకనిర్మాతలు కొత్త వారి కోసం అన్వేషణ మొదలుపెట్టారంటూ చెప్పుకొచ్చింది. నేను మంచి పర్ ఫార్మర్‌గా అంగీకరించబడ్డాను. త్వరలోనే ఏ లిస్ట్ జాబితాలో ఉన్న వారితో పనిచేస్తానని’ ధీమాగా చెప్పుకొచ్చింది అమలాపాల్.