in

allu sirish ku car konadaniki nirakarinchina allu arvind!

ల్లు అరవింద్ గారి మీద అలిగి రెండు సంవత్సరాలు కార్ నడపకుండా ఉండి, తన ఫస్ట్ రెమ్యూనరేషన్ తో కార్ కొనుక్కున్న అల్లు శిరీష్. అల్లు అరవింద్ గారి ఫామిలీ కాన్స్టిట్యూషన్ ప్రకారం, ఇంట్లోని మగపిల్లలకు 21 సంవత్సరాలు వచ్చిన తరువాత కార్ కొనిచ్చే ఆనవాయితీ ఉండేది. దాని ప్రకారం అల్లు శిరీష్ గ్రాడ్యుయేషన్ అయిన తరువాత ఒక 15 లక్షల్లో కార్ కొనుక్కోమని చెప్పారట అరవింద్ గారు. కానీ, శిరీష్ 25 లక్షలు కార్ కావాలి అనగానే, అంత సీన్ లేదమ్మా, నా బడ్జెట్ ప్రకారం కొనుక్కుంటే కొనుక్కో, లేదంటే నువ్వు సంపాదించి నీ ఇష్టమయిన కార్ కొనుక్కో అని ఖరాఖండి గ చెప్పేశారట.

ఆ మాటను సవాలు గ తీసుకొన్న శిరీష్ 2 ఇయర్స్ ఇంట్లో ఉన్న ఏ కార్ ను టచ్ చేయలేదట. గౌరవం అనే మూవీ లో హీరో రోల్ కి సెలెక్ట్ అయిన శిరీష్ కు ప్రకాష్ రాజ్ గారు 25 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారట, ఆ అమౌంట్ తో మిత్సుబిషి అవుట్ లాండర్ కార్ కొనుక్కొని, ఆ కీస్ అల్లు అరవింద్ గారి చేతిలో పెట్టి, ఆయన చేతే కొబ్బరి కాయ కొట్టించి , ఫస్ట్ డ్రైవింగ్ సీట్ లో అరవింద్ గారిని కూర్చోబెట్టి వారు ఒక రౌండ్ వేసాక, శిరీష్ ఆ కార్ వాడటం మొదలెట్టారట. అరవింద్ గారికి నిజమయిన పుత్రోత్సాహం అంటే ఇదే కదా. తనకు కార్ ఇప్పించలేదని ఆయనను తప్పు పట్టకుండా, పట్టుదలతో తన మొదటి సంపాదనతో కార్ కొనటం శిరీష్ కి ఒక మరపురాని సంఘటనే కావచ్చు కానీ, ఇది ఎంతో మంది ఈనాటి యువకులకు స్ఫూర్తిదాయకం.

will prabhas and team say yes to deepika’s condition?

f cube ‘mehreen pirzada’!