in

Allu Arjun and Trivikram to reunite for the 4th film?

పుష్ప రాజ్‌ అభినయానికి ఉత్తమ నటుడి అవార్డు అందుకోగా పుష్ప 2 లో అంతకుమించి అదరగొట్టేలా తన పాత్రని డిజైన్‌ చేసినట్టు తెలుస్తుంది. పుష్ప 2 ఆల్రెడీ సగానికి పైగా పూర్తి కాగా సినిమాపై ఇంకాస్త ఫోకస్‌ ఎక్కువ పెట్టి ఎక్కడ టార్గెట్‌ మిస్‌ అవ్వకూడదని ప్లాన్‌ చేస్తున్నారట. పుష్ప 2 తర్వాత కూడా అల్లు అర్జున్‌ భారీ ప్లానింగ్‌ తో ఉన్నాడని తెలుస్తుంది. పుష్ప తర్వాత ఆల్రెడీ సందీప్‌ వంగాతో సినిమా అనౌన్స్‌ చేశాడు. కానీ దాని కన్నా ముందు త్రివిక్రమ్‌ తో సినిమా చేయాలని చూస్తున్నాడు.

అల్లు అర్జున్‌ త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ అంటే ఫ్యాన్స్‌ కి పండుగ అన్నట్టే. జులాయితో మొదలైన వీరి కాంబో చేసిన సినిమాలన్నీ సూపర్‌ హిట్స్‌ అయ్యాయి. అల వైకుంఠపురములో అయితే నాన్‌ బాహుబలి రికార్డులను తిరగ రాసి అదరగొట్టేసింది. అల వైకుంఠపురములో లాంటి సూపర్‌ బ్లాక్‌ బస్టర్‌ తర్వాత త్రివిక్రమ్‌ అల్లు అర్జున్‌ కలిసి చేసే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలను అందుకునేలా త్రివిక్రమ్‌ కథ రెడీ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమా త్రివిక్రం కెరీర్‌ లో ఎప్పుడూ చేయని ఒక ప్రయోగాత్మక సినిమాగా ఉంటుందట. సినిమా ఒక పీరియాడికల్‌ డ్రామాగా ఫాంటసీ మూవీగా ప్లాన్ చేస్తున్నారట..!!

Samantha Returns 1 Crore Of Her Remuneration, here’s why!

‘Sagara Sangamam’ – The Pride Of Indian Cinema!