in

akhil to work with mega director!

క్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన అఖిల్ హీరోగా పరిచయమై 5 సంవత్సరాలు కావస్తుంది. అయితే వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ కూడా ఒక్కటి ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాయి. ప్రస్తుతం ఈ యంగ్ హీరో దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తో కలిసి చేస్తున్న సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ఈ సినిమాలో అందాల భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమా తర్వాత మెగాస్టార్ డైరెక్టర్ తో అఖిల్ సినిమా చేయనున్నాడు.

చిరంజీవి తో ‘సైరా నరసింహారెడ్డి’ వంటి సూపర్ హిట్ సినిమా తీసిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ తన తర్వాతి సినిమా చేయనున్నాడు. మరి ఈ సినిమాలో హీరోయిన్ అలాగే మిగితా నటీనటులు ఎవరు అనే విషయం ఇంకా తెలియదు. అలాగే ఈ సినిమా ఏ జోనర్లో ఉంటుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే అఖిల్ ఇప్పటివరకు తీసిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావాన్ని చూపించలేకపోయాయి. అందువల్ల ఇప్పుడు తీస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని ఈ అక్కినేని వారసుడు చూస్తున్నాడు.

amala paul bold web series!

anasuya about casting couch!