in

akhil to romance Tollywood’s lucky heroine!

క్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన అఖిల్ హీరోగా పరిచయమై 5 సంవత్సరాలు కావస్తుంది. అయితే వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ కూడా ఒక్కటి ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాయి. ప్రస్తుతం ఈ యంగ్ హీరో దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తో కలిసి చేస్తున్న సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ఈ సినిమాలో అందాల భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమా తర్వాత మెగాస్టార్ డైరెక్టర్ తో అఖిల్ సినిమా చేయనున్నాడు.

చిరంజీవి తో ‘సైరా నరసింహారెడ్డి’ వంటి సూపర్ హిట్ సినిమా తీసిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ తన తర్వాతి సినిమా చేయనున్నాడు.ఈ సినిమా భారీ స్టైలిష్ యాక్షన్ స్పై థ్రిల్లర్ అని తెలుస్తుంది. సుంకర రామబ్రహ్మం ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మించనున్న ఈ మూవీ లో అఖిల్ కి జోడీగా  రశ్మికను పరిశీలిస్తున్నారట. రష్మిక మందన్నని చిత్ర బృందం ఇటీవల సంప్రదించినట్టు తెలిసింది. ఆమె కూడా దాదాపు ఒకే చెప్పినట్టే అని ఫిలిం నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

kajal’s marriage will happen at her home!

2 heroines in talks to play chiru’s sister role!