మోనాల్ పుట్టిన రోజు(మే 13)సందర్భంగా గురువారం అఖిల్ ఆమెకు బర్త్డే విషెష్ తెలియజేస్తూ.. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. రాణులకు సంబంధించి చాలా కథలు విన్నా..రియల్ లైఫ్ రాణి మాత్రం నువ్వేనంటూ మోనాల్ పై ప్రేమను అఖిల్ చెప్పుకొచ్చారు. ఆమె గురించి వర్ణించడానికి తాను వాడిన పదాలు చిన్న పదాలు అని, అయితే ఆ పదాలను మించి వర్ణించడం తన వల్ల కావడం లేదని అఖిల్ చెప్పుకొచ్చాడు. మోనాల్ లాంటి వ్యక్తిని పరిచయం చేసినందుకు బిగ్ బాస్ షోకు థ్యాంక్స్ అని అఖిల్ అన్నాడు.
మోనాల్ భవిష్యత్తులో చాలా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నానని అఖిల్ పేర్కొన్నారు. ప్రేమతో జైకృష్ణ జై శ్రీరామ్ అంటూ అంటూ అఖిల్ తన పోస్ట్ ను ముగించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అఖిల్ పోస్టును చూసిన నెటిజన్లు మోనాల్ పై అఖిల్ కు ఇంత ప్రేమ ఉందా..? అని కామెంట్లు చేస్తున్నారు. ఇక అఖిల్, మోనాల్ కలిసి ‘గుజరాతి అమ్మాయి..తెలుగు అబ్బాయి’అనే వెబ్ సిరీస్లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.