in

aishwarya rajesh’s new plan for cinema offers!

మిళంలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ స్టేటస్ పొందిన ఐశ్వర్య రాజేష్ తెలుగులో మాత్రం క్రేజీ హీరోయిన్ గా మారలేకపోయింది. చేసిన రెండు సినిమాలు పరాజయం చవి చూడటంతో ఇక్కడ పెద్దగా ఆఫర్స్ రాలేదు. అయితే ఈ నేచురల్ బ్యూటీకి నేచురల్ స్టార్ నాని పక్కన నటించే ఛాన్స్ దక్కిందని తెలుస్తోంది. నాని నటిస్తున్న ‘టక్ జగదీష్’ సినిమాలో అమ్మడు కూడా ఒక హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. కాగా తమిళ్ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేశ్ ఇప్పుడు టాలీవుడ్ పై కూడా ఫోకస్ పెట్టాలని చూస్తోందట.

దీని కోసం హాట్ హాట్ ఫోజులతో ఫొటో షూట్స్ చేస్తూ అగ్ర నిర్మాతలందరికీ తన పోర్ట్ ఫోలీయోలు పంపడం మొదలు పెట్టందని సమాచారం. ఎలాగైనా ఇక్కడ పాగా వేసి సాయి పల్లవి వలె గుర్తింపు తెచ్చుకోవాలని ఆశపడుతోందట. అందుకే సాయి పల్లివి మాదిరిగా తెలంగాణ యాస కూడా నేర్చుకుందని కాస్టింగ్ వర్గాలు చెబుతున్నాయి. మరి టాలీవుడ్ లో పాగా వేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్న ఐశ్వర్య రాజేష్ కి ఏమాత్రం అవకాశాలు దక్కుతాయో చూడాలి

deepika denied advance for prabhas movie!

adhiti rao hydari about her role in ‘v’ movie!