
మీటు ఉద్యమం సినీ ఇండస్ట్రీలో ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అన్ని రంగాలలో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా బాధిత మహిళలు తాము అనుభవించిన మానసిక క్షోభను సోషల్ మీడియా ద్వారా ధైర్యంగా చెబుతున్నారు. అయితే ఇప్పుడు మరో హీరోయిన్ కూడా తనకు ఎదురైనా వేధింపుల గురించి నోరు విప్పింది. `కౌశల్య కృష్ణమూర్తి` సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య రాజేష్ ఈ ఏడాది విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో కనిపించింది. అయితే ఈ మధ్య ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన ఐశ్వర్య తన కెరియర్ ప్రారంభంలో తాను కూడా లైంగిక వేధింపులకు గురయ్యానని తెలిపింది. అయితే తనకు రంగు లేదని వేధించబడనని తెలిపింది. అలాగే ఎక్స్పోజింగ్ లో మన సౌత్ హీరోయిన్లు హిందీ భామలతో పోలిస్తే చాల వెనుకంజలో ఉన్నారని తెలిపింది.

