in

star heroine bhagya sri about prabhas!

యంగ్ రెబల్ ప్రభాస్ ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.పాన్ ఇండియా మూవీ కావడంతో పలువురు ఇతర ఇండస్ట్రీ నటులు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ భాగ్యశ్రీ ఈ మూవీలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ తో సెట్స్ లో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ పంచుకున్న భాగ్యశ్రీ పలు ఆసక్తికర విషయాలు తెలియజేశారు. అందరిలాగే ప్రభాస్ మంచి తనానికి భాగ్యశ్రీ కూడా ఫిధా అయిపోయారు. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కావడంతో భాగ్యశ్రీ మొదట బయపడ్డారట. అయితే ప్రభాస్ ఫ్రెండ్లీ బిహేవియర్ తో ఆ భయం పోయిందట. ప్రభాస్ అంత పెద్ద స్టార్ హీరో అయినా అలా ఒదిగి ఉండడం ఆమెకు బాగా నచ్చిందట. అంతేకాకుండా వీరిద్దరూ ఫుడ్ లవర్స్ కావడంతో ఫుడ్ కి సంబందించిన అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారట. అయితే ఈ సినిమాలో ఆమె రోల్ ఏమిటనే విషయాన్ని మాత్రం భాగ్యశ్రీ బయటపెట్టలేదట.

HAPPY BIRTHDAY CHANDRA MOHAN!

rashi khanna’s unknown talent!