in

light man nundi top hero ga yedhigina ravi teja!

దైనా సాధించాలనే తపన, పట్టుదల, కృషి వీటన్నితో పాటుగా కష్టపడే తత్వం ఉంటేచాలు జీవితంలో సాధించాలి అనుకున్నది కచ్చితంగా సాధించి తీరుతారు. ఇది ఇప్పుడు కొత్తగా నేను చేతున్నదేం కాదు. ఇది వరకే చాలా మంది చెప్పిన విషయమే. కాలం ఎప్పుడు ఎవరిని అందలం ఎక్కిస్తుందో, ఎవరిని అధఃపాతాళానికి తొక్కేస్తుందో తెలియదు. ఎవరిని తక్కువ అంచనా చేసి చూడకూడదు. ఇప్పుడు ఇదంతా అసలు ఎందుకు మాట్లాడుతున్నానో అనుకుంటున్నారు కదా? కృషి, పట్టుదల ఉంటే అనుకున్నది ఎలా సాధించవచ్చో నిరూపించిన హీరోలు మన టాలీవుడ్ లో చాలామందే ఉన్నారు. ముఖ్యంగా చెప్పుకోదగిన పేర్లు కొన్ని మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ రవితేజ, నాచురల్ స్టార్ నాని ఇలా చాలా మందే ఉన్నారు. సినిమాలంటే మక్కువతో, ఇష్టంతో సినీ ఇండస్ట్రీకి వచ్చి దొరికిన చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇప్పుడు సినిమాలనే శాసించే స్థాయికి ఎగిసిన వీరి పట్టుదల, సంకల్పం మన అందరికి ఆదర్శం. అయితే వీరిలో ఒకరైన రవితేజ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. లైట్ మ్యాన్ స్థాయి నుండి టాలీవుడ్ టాప్ హీరో వరకు ఎదిగిన మన మాస్ మహారాజ్ రవితేజ గురించి.

మాస్ మహారాజ రవితేజ అసలు పేరు “రవి శంకర్ రాజు భూపతిరాజు”. జనవరి 26, 1968 లో రవితేజ జన్మించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రవితేజ వచ్చినప్పుడు అయన వయస్సు ఏంటో తెలుసా ? 23 నిజమేనండి 23 సంవత్సరాల వయస్సులో రవితేజ తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టాడు. మొట్ట మొదట ఆయనకి ఇండిస్టీలో వచ్చిన పని “లైట్ బాయ్” మీరు విన్నది నిజమే ఒక లైట్ బాయ్ గా రవితేజ తన ప్రస్థానాన్ని తెలుగు చిత్ర పరిశ్రమలో మొదలుపెట్టాడు. ఆ సమయంలో అయన పడ్డ కస్టాలు అన్ని ఇన్ని కావు. తినడానికి తిండి సరిగ్గాలేక, చాలీ చాలని డబ్బులతో తన జీవితాన్ని ఎన్నో కష్టాలతో మొదలు పెట్టిన రవితేజ. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఆ సమయంలోనే పరిచయం అయ్యారు అతని స్నేహితులు, ఇప్పటి టాప్ దర్శకులు కృష్ణవంశీ, పూరీజగన్నాద్. ఆ తరువాత సినిమాల్లో చిన్న చిన్న పత్రాలు కూడా చేసేవాడు. తనకి దొరికిన ప్రతీ అవకాశాన్ని వదలకుండా కష్టపడ్డాడు. అదే సమయంలో కృష్ణవంశీ తాను చేస్తున్న సినిమా “సింధూరం”లో అద్భుతమైన పాత్ర ఇచ్చాడు. ఆ పాత్రకి తెలుగు ప్రేక్షకుల్లో అద్భుతమైన స్పందన వచ్చింది. అప్పటినుంచి వెనుతిరిగి చూడకుండా ప్రయ్నతాలు చేస్తూనే ఉన్నాడు. అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకుంటూ సాగుతున్న అయన కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. హీరోగా తొలిచిత్రం “నీకోసం” తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఆ తరువాత ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు హిట్ సినిమాలు వరుసగా పడటంతో అయన దశ తిరిగింది.

కానీ అయన కెరీర్ కి బ్రేక్ ఇచ్చిన సినిమా మాత్రం “ఇడియట్”. ఈ చిత్రం తెలుగునాట ఒక ఊపు ఊపేసింది. ఇందులో మరో సెంటిమెంట్ కూడా ఉంది అదే రవితేజ మొదటి సినిమా సింధూరంలో అయన క్యారెక్టర్ పేరు “చంటి”, రవితేజ కెరీర్ మలుపుతిప్పిన “ఇడియట్” సినిమాలో కూడా అయన పేరు “చంటి”. ఇక ఇడియట్ సినిమానుంచి వెనుతిరిగి చూడలేదు రవితేజ. ప్రస్తుతం అయన వయస్సు 52 సంవత్సరాలు ఇప్పటికీ అయన వయస్సు 50 పైనే ఉంది అంటే ఎవరు నమ్మలేరు. కానీ ఆ వయస్సులో కూడా రవితేజ ఎనేర్జి ఏమాత్రం తగ్గలేదు. అయన బాడీ లాంగ్వేజ్, ఎనర్జీ ఏమాత్రం ఏమాత్రం తగ్గకుండా సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్య కొంచెం ఫ్లాప్ సినిమాలు వచ్చినా రవితేజ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా రిలీజ్ అయినా “డిస్కో రాజా” సినిమానే ఇందుకు నిదర్శనం.

aishwarya rajesh about casting couch!

chiru – vijay shanti to reunite again?