in

Aha launches its new web series Anya’s Tutorial!

తొలి తెలుగు ఓటీటీ ఆహా, ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్కా సంయుక్తంగా నిర్మిస్తోన్న వెబ్‌ సిరీస్‌లో రెజీనా నటిస్తున్నారు. ‘అన్యాస్‌ ట్యుటోరియల్‌’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ వెబ్‌ సిరీస్‌కు గంగిరెడ్డి పల్లవి దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్త్య, నివేదా సతీష్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్‌ శుక్రవారం ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నటి రెజీనా వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

హారర్‌ కథకు నిజమైన ఎమోషన్స్‌ జోడిస్తూ రాసుకొచ్చిన ఈ కథ తనను ఎంతో ఆకట్టుకుందని రెజీనా తెలిపారు. ఇందులో నివేదితా తనకు సోదరిగా నటిస్తుందని, ప్రతిభావంతులైన మహిళా బృందంతో ఈ సిరీస్‌ చేస్తున్నామని ఆమె తెలిపారు. క్రిస్మస్‌ కారణంగా ఈ వెబ్‌ సిరీస్‌ను ‘ఆహా’లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘ఎవరు’, ‘చక్ర’ వంటి ఇంట్రెస్టింగ్‌ కథాంశాలతో వచ్చిన సినిమాల్లో నటించి తనలోని మరో కోణాన్ని బయటపెట్టిన రెజీనా మరి ఈ వెబ్‌ సిరీస్‌తో ఎలాంటి ఇమేజ్‌ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Iswarya Menon Pics: Vibes In Saree!

Amala Paul in Tight Hot Black T-Shirt!