in

after samantha, now Naga Chaitanya to debut on OTT!

మొన్నటి వరకు నటీనటులకు ఎక్కువగా సినిమాలపైనే ఫోకస్ ఉండేది. కానీ ఇప్పుడు వెబ్ కంటెంట్ పై కూడా దృష్టి పెడుతున్నారు. సమంత నటించిన
‘ద ఫ్యామిలీ మ్యాన్’ వంటి ఆఫర్స్ వస్తే ఏ మాత్రం నో చెప్పకూడదని అనుకుంటున్నారు. వెబ్ సీరీస్ లు కూడా బిజినెస్ గట్టిగానే చేస్తున్నాయి. దీంతో రెమ్యునరేషన్ కూడా రెగ్యులర్ సినిమా మార్కెట్ కు తగ్గట్లుగానే ఉంటోంది.

త్వరలోనే హీరో నాగ చైతన్య కూడా OTT ప్రపంచంలో అడుగుపెట్టనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ హీరో యొక్క తొలి OTT ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వడానికి సిద్ధమవుతోందట. ప్రముఖ నిర్మాత శరత్ మరార్ ప్రొడక్షన్ లోనే ఆ వెబ్ ఫిల్మ్ తెరకెక్కుతున్నట్లు టాక్ అయితే వస్తోంది.  గత రెండేళ్ల నుంచి కూడా చైతన్య శరత్ మరార్ తో ఒక ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటున్నాడు.

కమిట్మెంట్ ఇవ్వడంతో చైతన్య కోసం మంచి కథలను సెట్ చేయాలని నిర్మాత చాలా కాలంగా సెర్చ్ చేస్తున్నాడు. ఇక ఇటీవల ఒక వెబ్ కంటెంట్ నచ్చడంతో చైతన్యకు చెప్పారట..ఇక కొత్తగా ఉంటుందని చైతన్య కూడా వెంటనే ఒప్పేసుకున్నట్లు సమాచారం. ఇక దర్శకుడు ఎవరనే విషయాన్ని బయటకు చెప్పలేదు. త్వరలోనే అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర హీరోలు కూడా ఓటీటీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.

Jacqueline Fernandez goes backless on Instagram!

nota actress Yashika Anand critical after car accident!