in

after samantha now milky beauty to host a talk show for ‘aha’!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది మిల్కీబ్యూటీ తమన్నా. ప్రస్తుతం ఈ అమ్మడు టైం చాలా స్లోగా నడుస్తుంది. తమన్నాకు అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. ప్రస్తుతం ఈ బ్యూటీ గోపీచంద్ సరసన సీటీమార్ సినిమాలో నటిస్తుంది. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా ఫీమేల్ టీమ్ కోచ్ గా కనిపించనుంది. ఇదిలా ఉంటే త్వరలో తమన్నా వెబ్ సిరీస్ లోకి అడుగు పెట్టనుంది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక వెబ్ సిరీస్ కు తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మొత్తం 8 ఎపిసోడ్స్ గా ప్రసారం కాబోతున్న ఈ వెబ్ సిరీస్ లో ప్రముఖ నటీనటులను నటింపజేస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కబోతుంది. ఎప్పుడు విడుదల అయ్యే విషయమై మరో నెల రోజుల్లో దర్శకుడు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల టాక్ . మరో వైపు తమన్నా హోస్ట్ గా మారనుంది. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ “ఆహా” కోసం అమ్మడు యాంకర్ అవతారమెత్తనుంది. వంద మంది సెలబ్రెటీలతో తమన్నా టాక్ షో ఉంటుందని. ఈ షో  రెండు లేదా మూడు సీజన్ లుగా సాగుతుందని ఇందుకోసం తమన్నాకు ఆహా వారి నుండి భారీ పారితోషికం అందినట్టు ప్రచారం జరుగుతోంది..

A.S DILEEP KUMAR NUNDI A.R Rahman GA MAARADANIKI ASALU KARANAM IDHE!

‘vakeel saab’ theatres list, biggest release in pk’s career!