తెలుగు అవ్వని తమిళ్ అవ్వనీ హిందీ అవ్వనీ ఎక్కడైనా కూడా ఫీమేల్ నటులకి దర్శకులు నుంచి హీరోలు నిర్మాతల వరకు ఇబ్బందులు తప్పవు. ఇది ఇప్పటికీ కొనసాగుతున్న ఒక హార్డ్ నిజం. అయితే రీసెంట్ గా టాలీవుడ్ ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన “భగవంత్ కేసరి” లో గుడ్ టచ్ అంటూ బాడ్ టచ్ అంటూ చేసిన డైలాగ్స్ పై నిజ జీవితంలో కూడా అలాంటివి పాటించాలి అని ఓ ప్రముఖ నటి కామెంట్స్ చేసింది. కానీ ఇప్పుడు ఓ తమిళ నటి బాలయ్యపై చేసిన పలు షాకింగ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కోలీవుడ్ కి చెందిన సీనియర్ నటి విచిత్ర బాలకృష్ణతో “భలేవాడివి బాసు” అనే సినిమా టైం లో జరిగిన చేదు అనుభవాన్ని తమిళ్ బిగ్ బాస్ నుంచి షేర్ చేసుకుంది. కాగా ఆమె మాట్లాడుతూ ఆ సినిమా సమయంలో బాలకృష్ణ నన్ను అసభ్యకరంగా ఇబ్బంది పెట్టేవాడిని తన రూమ్ కి పిలిచాడని తాను ఓకే చెప్పలేదు అని నానా రకాలుగా ఇబ్బంది పెట్టారని ఆమె చెప్పుకొచ్చింది. ఆ తర్వాత రోజు నుంచి తన డోర్ ని ఎవరో కొట్టేవారు అని ఆమె పలు షాకింగ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో తమిళ సినీ వర్గాల నుంచి బయటకి వచ్చి వైరల్ గా మారింది. మరి వీటిపై బాలయ్య అభిమానులు ఏమంటారో చూడాలి..!!