కర్ణాటకకు చెందిన అజీజ్ పాషా అనే వైద్యుడిని సంజన వివాహం చేసుకుంది. ప్రస్తుతం భర్తతో కలసి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. నేడు డాక్టర్స్ డే సందర్భంగా సంజన సోషల్ మీడియాలో వైద్యులందరికి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపింది. తన భర్త పాషా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘డాక్టర్లు రియల్ హీరోలు.. ఈ విపత్కర సమయంలో ఆ విషయం మనందరికీ అర్థం అయింది. వైద్యులు ఎన్నో మిళియన్ల మంది ప్రాణాలు రక్షిస్తున్నారు. వారి జీవితాలని త్యాగం చేసి మరీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్యులు విధులు నిర్వహిస్తున్నారు.
నేను కూడా ఓ వైద్యుడి భార్యనే. ఈ విపత్కర సమయంలో నా భర్తకు అనేకసార్లు చెప్పా. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న టైంలో కనీసం నెలరోజులైనా సెలవు పెట్టమని అడిగా. అలా అయినా ఇద్దరం కలసి ఉండే టైం పెరుగుతుంది అని అడిగా. కానీ ఆయన చెప్పిన సమాధానం ఎప్పటికీ మరచిపోలేను. నేను వైద్యుడిని. అనారోగ్యంతో, ప్రాణాపాయంలో ఉన్న వారికీ చికిత్స అందించడం నా వృత్తి. నా మొదటి ప్రాధాన్యత దానికే అని సమాధానం ఇచ్చారు. ఈ విషయంలో కేవలం నా భర్త మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్న వైద్యులంతా నాకు ఆదర్శంగా నిలిచారు. అని సంజన తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో పేర్కొంది.