in

Actress Namitha to start OTT platform named ‘Namitha Theatre’!

హీరోయిన్ నమిత థియేటర్ లో ఇకపై సినిమాలు కూడా చూడవచ్చు. అదేంటి నమిత థియేటర్ ఏమైనా కట్టబోతోందనుకుంటున్నారా? అదేం కాదు. నమిత ఓటీటీ ప్లాట్ ఫామ్ ను స్థాపించనుంది. దానిపేరే నమిత థియేటర్. సాప్ట్ వేర్ ఇంజనీర్ రవివర్మతో కలసి ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ అందుబాటులోకి తీసుకురాబోతోంది నమిత. ఈ మేరకు అధికారికంగా కూడా ప్రకటించింది నమిత. ఇందులో షార్ట్ స్టోరీస్ తో పాటు..

వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిన సినిమాలను ప్రదర్శిస్తారట..అంతే కాదు అవకాశాల కోసం ఎదురు చూస్తున్న యువదర్శకులకు అతి తక్కువ బడ్జెట్ లో సినిమాలు నిర్మించాలనుకునే వారికి ఈ ఫ్లాట్ ఫామ్ ఓ వేదిక గా మారుస్తానంటోంది నమిత. త్వరలోనే నమిత థియేటర్ విధి విధానాలను ప్రణాళికను విడుదల చేస్తానని చెబుతోంది నమిత. మరి నమిత ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వార ఏ మేరకు విజయం సాధిస్తుందో చూద్దాం..

Manchu Lakshmi Trolled By Netizens Over Her Marriage Video Post!

makeup lekunda natinchi industry nu thana vaipu thippukunna sai pallavi!