
బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్, టీమ్ ఇండియా యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ పేర్లు ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ నెటిజన్లు ప్రచారం మొదలుపెట్టారు. అయితే ఈ ప్రచారానికి బలమైన ఆధారాల కంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోనే కారణం..
ఇటీవల ముంబైలోని ఓ కేఫే నుంచి మృణాల్ ఠాకూర్, యశస్వి జైస్వాల్ వేర్వేరుగా బయటకు వస్తున్న వీడియో వైరల్ అయింది. ఇద్దరూ ఒకే సమయంలో ఒకే ప్రదేశంలో కనిపించడంతో..“సీక్రెట్ డేట్”, “రిలేషన్‌షిప్ కన్ఫర్మ్” అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. క్షణాల్లోనే ఈ వార్త వైరల్‌గా మారిపోయింది. అయితే ఇప్పటివరకు మృణాల్ ఠాకూర్ కానీ, యశస్వి జైస్వాల్ కానీ ఈ ప్రచారంపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఇద్దరూ కలిసి సినిమా, ప్రకటన లేదా ఇతర ప్రాజెక్ట్ కోసం కలిశారా? లేక యాదృచ్ఛికంగా ఒకే కేఫేలో కనిపించారా? అన్నదానిపై కూడా స్పష్టత లేదు..!!
