in

actor sachin joshi arrested!

టుడు సచిన్‌ జోషి అరెస్ట్‌ అయ్యారు. గుట్కా అక్రమ రవాణా చేస్తున్న వ్యవహారం ముంబయిలో హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. ఈ మేరకు ఆయనపై ఐపీసీ 273,336 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా సచిన్‌ జోషి హిందీ, తెలుగు భాషల్లో వివిధ చిత్రాల్లో నటించారు. అతను ప్రస్తుతం పలు బాషలలో సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. హిందీ నటి, మోడల్ ఊర్వసీ శర్మను వివాహం చేసుకుని దుబాయ్‌లో నివసిస్తున్నారు. గత మార్చిలో హైదరాబాద్‌లో సుమారు 80 బాక్సుల్లో గుట్కాను స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో సచిన్ జోషిని ప్రధాన నిందితుడిగా చేర్చారు. సచిన్‌ జోషి ప్రస్తుతం విదేశాలలో నివసిస్తున్నందున హైదరాబాద్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు పంపారు. ఇటీవల ముంబై చేరుకున్న సచిన్ జోషి మంగళవారం దుబాయ్‌కు తిరిగి వెళ్ళడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో భారీగా గుట్కా అక్రమ రవాణాని పట్టుకున్న పోలీసులు.. ఓనర్లపై నిఘా పెట్టారు.

CHANDRA MOHAN GARIKI UNNA OKA CHITHRAMAINA ALAVAATU!

samantha to repeat ‘oh baby’ combination!