టెలివిజన్ నుంచి వచ్చి సినిమాల్లో స్టార్ హీరోయిన్స్ అయినవాళ్లు చాలామందే ఉన్నారు. వారి బాటలోనే అడుగులు వేసింది దిగంగనా సూర్యవంశీ. చాలా హిందీ టీవీ సీరియల్స్‌లో నటించిన తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఫ్రైడే, జిలేబీ, రంగీలా రాజా వంటి చిత్రాల్లో నటించాక ‘హిప్పీ’ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగు పెట్టింది. వలయం, సీటీమార్ చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది. ప్రస్తుతం సందీప్ కిషన్‌తో ఓ మూవీ చేస్తోంది. ఇప్పుడు ఆది సాయి కుమార్‌కి జోడీగా సెలెక్టయ్యింది. సిరికి ఫణికృష్ణ డైరెక్షన్‌లో కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు. మరోవైపు హిందీలో ద బ్యాటిల్ ఆఫ్ భీమ కొరెగావ్, డార్క్ పాథ్ చిత్రాల్లో కూడా నటిస్తోంది దిగంగనా. వీటిలో ఏ ఒక్కటి క్లిక్ అయినా ఆమె కెరీర్ మలుపు తిరిగే చాన్స్ లేకపోలేదు.