in

Aadhi Pinisetty as the antagonist in Ram pothineni’s film!

కేవలం హీరోగానే కాకుండా.. ప్రతి నాయకుడి పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాడు. గతంలో అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన “సరైనోడు” సినిమాలో ఆది పినిశెట్టి.. విలన్ పాత్రలో నటించి.. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. ఆది నుంచి అంతగా మూవీ అప్‏డేట్స్ రాలేదు. తాజాగా ఈ హీరో ఇప్పుడు మరోసారి విలన్ పాత్రలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడట. అది కూడా ఎనర్టిటిక్ స్టార్ హీరో రామ్ సినిమాలో కనిపించబోతున్నట్లుగా సమాచారం.

రామ్ పోతినేని, కృతిశెట్టి జంటగా.. లింగుస్వామి దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. హైదరాబాద్, విశాఖపట్నం ప్రాంతాలలో ఈ మూవీ షెడ్యూల్స్ ప్లాన్ చేశారట మేకర్స్. యాక్షన్ ఎంటర్ టైనర్‏గా రాబోతున్న ఈ మూవీలో విలన్ పాత్రను కూడా చాలా ఢిపరెంట్‏గా, పవర్ ఫుల్‏గా ఉండేలా ప్లాన్ చేశాడట డైరెక్టర్. అయితే అందుకోసం ఓ సాలీడ్ విలన్ కోసం చూస్తున్నట్లుగా సమాచారం. దీంతో ఈ మూవీలో ఆది పినిశెట్టిని విలన్ పాత్ర కోసం తీసుకోబోతున్నట్లుగా తెలస్తోంది. .

Raai Laxmi Sparkles In A Saree!

anchor anasuya feels lucky for getting second chance!