
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని, చాల చిన్న వయసులోనే హీరో గ ఎంట్రీ ఇచ్చారు, అంతే కాకుండా చాల అరుదైన రికార్డు కూడా తన పేరు మీద నమోదు చేసుకున్నారు, ఆ వివరాలు తెలుసుకోవాలని ఉందా? అయితే ఒకే. రామ్ పోతినేని తన 13 సంవత్సరాల వయసులోనే అడాయలం అనే తమిళ్ షార్ట్ ఫిలిం లో నటించటమే కాకా, యూరోపియాన్ మూవీ ఫెస్టివల్ లో బెస్ట్ ఆక్టర్ అవార్డు పొందారు, ఇది ఒక రికార్డు అయితే, తన 15 సంవత్సరాల వయసులో, వై.వి.ఎస్. చౌదరి గారు నిర్మించిన దేవదాసు లో హీరో గ, ఇలియానా తో జత కట్టి తెలుగు ప్రేక్షకులను అలరించటమే కాకా, తన మొట్ట మొదటి చిత్రం సిల్వర్ జూబిలీ చిత్రం అవటం తో మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ఇంత వరకు తెలుగు సినీ చరిత్రలో మొదటి మూవీ సిల్వర్ జూబిలీ చేసుకున్న ఘనత ఏ హీరో కు దక్కలేదు. ఇటువంటి అరుదైన రికార్డులతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన రామ్ పోతినేని, ఆ తరువాత వరుస విజయవంతమయిన సినిమాలతో ముందుకు సాగిపోతున్నారు.