ఏ.ఎస్. దిలీప్ కుమార్ , ఏ. ఆర్. రెహమాన్ గ ఎందుకు, ఎలా మారారు. ఆర్.కె. శేఖర్ తమిళ చిత్ర సీమలో ఒక మ్యూజిక్ కండక్టర్ ,అయన కుమారుడే ఏ.ఎస్. దిలీప్ కుమార్, దిలీప్ కి 9 సంవత్సరాల వయసులోనే, తండ్రి శేఖర్ గారు అనారోగ్యం తో మరణించారు. చిన్న వయసులోనే కుటుంబ భారం మీద పడగా తండ్రి గారి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ని అద్దెకు ఇస్తూ, ఆ తరువాత కీ బోర్డు ప్లేయర్ గ, గిటారిస్ట్ గ అనేక మంది సంగీత దర్శకుల వద్ద పని చేసిన దిలీప్ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
1984 లో తన చెల్లెలు అనారోగ్యం పాలవడం తో ఎన్నో చోట్ల వైద్యం చేయించిన పెద్దగా ప్రయోజనం లేని సమయం లో, ఒక శ్రేయోభిలాషి ద్వారా ఖ్యాద్రి తారీఖ్త్ గారి తో పరిచయం కావటం, ఆయన అందించిన వైద్యం, చేసిన ప్రార్ధనల కారణం గ చెల్లెలు అనారోగ్యం నుంచి బయట పడటం తో, ఇస్లాం పైన నమ్మకం, మక్కువ పెరిగింది. 1989 లో కుటుంబ సమేతం గ ఇస్లాం మతం స్వీకరించిన దిలీప్ కుమార్ తన పేరును , అల్లాహ్ రఖా. రెహమాన్ గ మార్చుకున్నారు. అప్పటి నుంచి అయన ఏ.ఆర్. రెహమాన్ గ చలామణి అవుతున్నారు..