రెబల్ స్టార్ కృష్ణం రాజు గారు మొగల్తూరు లో ఉన్నతమయిన జమిందారీ కుటుంబం లో పుట్టారు, చిన్న తనం లో కొంత మేము జమిందారులం, అనే భావం ఉండేది ఆ తరువాత జీవితం లో జరిగిన కొన్ని అనుభవాల వలన ఆ అహం తొలగి అందరితో చాల స్నేహ భావం తో అందరిలో ఒకడిగా మెలగటం అలవాటు చేసుకున్నారు. అయన కాలేజీ రోజుల్లో చాల సరదాగా, స్టైలిష్ గ ఉండే వారు, ఆయనను చూసి కొంత మంది స్నేహితులు ఈర్ష పడే వారు. ఆ రోజుల్లో కృష్ణం రాజు గారికి సిగెరెట్ తాగే అలవాటు ఉండేది, ఆయన రొమాంటిక్ హీరో అక్కినేని నాగేశ్వర్ రావు గారి అభిమాని, కాలేజీ బయట బైక్ ఆపి స్టైల్ గ అక్కినేని రేంజ్ లో,సిగెరెట్ తాగుతుంటే చూసి కడుపు మండిన తుంటరి స్నేహితుడు ఒకడు, కృష్ణం రాజు గారి తండ్రి గారికి ఒక ఆకాశ రామన్న ఉత్తరం రాసాడు. మీ పుత్ర రత్నం ఇక్కడ కాలేజీ చదువు పక్కన పెట్టి, సిగెరెట్ లు తాగుతూ జల్సాలు చేస్తున్నాడు, మీరు ఇలాగె వదిలితే ఇక అంతే సంగతులు అని చాల బాడ్ గ రాసాడట. ఆ లెటర్ చూసిన కృష్ణం రాజు గారి నాన్న గారు..
ఆ లెటర్ కి ,చిన్న పేపర్ మీద, ఒక నోట్ వ్రాసి తిరిగి కృష్ణం రాజు గారికి పంపించారట, అందులో ఏమి రాసి ఉందొ తెలుసా? నువ్వు నా కొడుకువి నీ మీద నాకు నమ్మకం ఉంది, ఇటువంటి స్నేహితులను కొంచెం దూరం పెట్టు అని రాశారట, ఆ లెటర్ చూసిన కృష్ణం రాజు గారికి కళ్ళలో నీరు తిరిగింది అట. కృష్ణం రాజు గారి తండ్రి గారు తరచూ ఒక మాట చెప్పే వారట పిల్లలను 5 సంవత్సరాల వయసు వరకు దేవుడిలాగా చూడాలి, ఆ తరువాత 18 సంవత్సరాల వయసు వరకు బానిస లాగ చూడాలి, ఆ తరువాత స్నేహితుడి లాగ చూడాలి అనే చెప్పే వారట, ఎంత గొప్ప జీవిత సత్యమో చుడండి. మూడు ముక్కల్లో పిల్లలను ఎలా పెంచాలో చెప్పేసారు ఆయన, రియల్లీ ఏ గ్రేట్ ఫాదర్ టు ఏ ప్రౌడ్ సన్..!!