
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన జీవితంలో ఎంతో ఆనందకరమైన దశను ఆస్వాదిస్తోంది. దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న ఆమె త్వరలో మొదటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ నేపథ్యంలో సమంత, రాజ్ నిడిమోరు దంపతులు తమ ఇంట్లో ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను సమంత సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో సమంత ఎరుపు రంగు అనార్కలీ డ్రెస్‌లో ఎంతో అందంగా కనిపిస్తోంది. మరోవైపు రాజ్ నిడిమోరు క్రీమ్ కలర్ కుర్తా, తెల్లటి పైజామా ధరించి సంప్రదాయబద్ధంగా కనిపించారు.
ఒక ఫోటోలో ఈ జంట ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. అలాగే పూజా కార్యక్రమంలో పాల్గొంటూ పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటున్న ఫోటోలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సమంత తల్లి నినెట్ ప్రభుతో కలిసి దిగిన ఫోటోతో పాటు ఇరు కుటుంబాలకు చెందిన మహిళలతో కలిసి దిగిన చిత్రాలను కూడా ఆమె అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోలకు సమంత 'Us' అనే చిన్న క్యాప్షన్ జోడించడం విశేషం. ఇదిలా ఉంటే, సమంత తన ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. గతంలో తన ప్రెగ్నెన్సీ సమయంలో వ్యాయామాలు చేస్తున్న వీడియోను కూడా షేర్ చేసింది. మొదటి నెల నుంచి తొమ్మిదో నెల వరకు తన ఫిట్నెస్ ప్రయాణాన్ని ఆ వీడియోలో చూపించింది.
అంతేకాకుండా సెప్టెంబర్‌లో రాజ్ నిడిమోరుతో కలిసి సంప్రదాయ సీమంతం వేడుకను కూడా నిర్వహించుకుంది. ఇక సమంత, రాజ్ నిడిమోరు 2025 డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్లో అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ 'ది ఫ్యామిలీ మ్యాన్ 2', 'సిటాడెల్: హనీ బన్నీ' వంటి ప్రాజెక్టుల సమయంలో పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం సమంత తన మాతృత్వాన్ని ఆస్వాదించేందుకు సిద్ధమవుతూనే కెరీర్‌కు సంబంధించిన ప్రణాళికలు కూడా రూపొందించుకుంటోంది. ఆమె చివరిగా 'మా ఇంటి బంగారం' చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. మాతృత్వ విరామం తర్వాత 'రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్' ప్రాజెక్టులో తిరిగి బిజీ అయ్యే అవకాశముంది. మొత్తానికి సమంత షేర్ చేసిన తాజా ఫోటోలు అభిమానుల్లో ఆనందాన్ని నింపుతున్నాయి..!!
See all the photos: Samantha and Raj Nidimoru’s baby shower – photo gallery
