
ఒకప్పుడు వరుస సినిమాలతో టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా దూసుకుపోయిన శ్రీలీల ప్రస్తుతం కెరీర్ సక్సెస్ ట్రాక్ లో లేదు. కెరీర్ బిగినింగ్ లో స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు అందుకున్నప్పటికీ, ఆశించిన స్థాయిలో విజయాలు మాత్రం దక్కలేదు. వరుస పరాజయాలతో కెరీర్లో కాస్త వెనుకబడిన శ్రీలీలకు ఇప్పుడు ఒక బలమైన హిట్ అవసరం.
రజనీకాంత్ లాంటి సూపర్‌స్టార్ సినిమాలో నటించడం ఏ హీరోయిన్‌కైనా ప్రత్యేకమైన గుర్తింపు. అందులోనూ ‘ధర్మన్’ చిత్రానికి కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మాతలుగా వ్యవహరిస్తుండటం, అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తుండటం ఖచ్చితంగా ఇది క్రేజీ ఆఫర్. శ్రీలీలకు టాలెంట్ ఉంది, గ్లామర్ వుంది, డ్యాన్స్‌లో ఎనర్జీ ఉంది, ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. అయితే ఇప్పుడు ఆమెకు కావాల్సింది ఒక సాలిడ్ సక్సెస్. మరి వరుస పరాజయాలకు రజనీకాంత్ సినిమాతో శ్రీలీల బ్రేక్ వేస్తుందా? సూపర్‌స్టార్‌తో కలిసి చేసిన ఈ సినిమా ఆమె కెరీర్‌ను మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి తీసుకొస్తుందా? అన్నది చూడాలి..!!
