in

Official Confirmation: sreeleela in ajith’s dare devil

Official Confirmation: sreeleela in ajith’s dare devil

శ్రీలీల మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేశారు. అజిత్ కొత్త మూవీ ‘డేర్ డెవిల్’లో హీరోయిన్‌గా నటించనున్నారు. నిన్న చెన్నైలో జరిగిన ప్రారంభ వేడుకలో డైరెక్టర్ ఆధిక్ రవిచంద్రన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్‌తో పాటు ఆమె పాల్గొన్నారు. కాగా తొలుత శ్రీలీలను తప్పించి కయాదు లోహర్‌ను తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ పూజా కార్యక్రమానికి శ్రీలీల హాజరవడంతో ఆ రూమర్స్‌కు ముగింపు పడింది. అటు వరుస ఫ్లాపులతో తెలుగులో శ్రీలీలకు ఛాన్సులు తగ్గిపోయాయి. ఈ సినిమా హిట్ అయితే మళ్లీ అవకాశాలు పెరగవచ్చు ‘డేర్ డెవిల్’ అజిత్ 64వ చిత్రం. 2025లో వచ్చిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తర్వాత ఆధిక్ రవిచంద్రన్‌తో ఆయనకు ఇది రెండో సినిమా. అజిత్ భార్య షాలిని బ్రేవ్‌హార్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాతగా ఆమెకు ఇదే తొలి సినిమా. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ వేడుకకు అజిత్ హాజరుకాలేదు..!!

Radhika Apte says she ‘hated everything’ about Legend!

Payal rajput shows gratitude in being associated with Tollywood!