in

Telugu girl Satvika Veeravalli onboard for rc17?

Telugu girl Satvika Veeravalli onboard for rc17?

సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు సర్వం సిద్ధమవుతున్న ఈ తరుణంలో చిత్ర కథానాయిక ఎంపిక టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ రేసులో ఎందరో ప్రముఖ నటీమణులను వెనక్కి నెట్టి, అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి సాత్విక వీరవల్లికి అవకాశం దక్కినట్లు బలమైన ప్రచారం జరుగుతోంది. ‘RC17’ ప్రకటన వెలువడిన నాటి నుంచే హీరోయిన్ ఎవరనే దానిపై అనేక ఊహాగానాలు వినిపించాయి. గతంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించి, ‘ధురంధర్’ సిరీస్‌తో విజయాలు అందుకున్న సారా అర్జున్‌తో పాటు రుక్మిణి వసంత్, అనీత్ పడ్డ, అనస్వర రాజన్ వంటి యువ నటీమణుల పేర్లు ప్రముఖంగా పరిశీలనలో ఉన్నట్లు వార్తలొచ్చాయి.

అయితే, దర్శకుడు సుకుమార్ తనదైన శైలిలో కథలోని గ్రామీణ వాతావరణానికి, పాత్రలోని సహజత్వానికి సరిగ్గా సరిపోయే కొత్త ముఖం కోసం అన్వేషించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన దృష్టి సాత్విక వీరవల్లిపై పడినట్లు సమాచారం. ఇప్పటికే ఆమె స్క్రీన్ టెస్ట్, నటన పట్ల చిత్ర బృందం సంతృప్తిగా ఉందని, రామ్ చరణ్ సరసన ఆమె ఎంపిక దాదాపు ఖరారైందని ఫిల్మ్‌నగర్ వర్గాలు కోడై కూస్తున్నాయి. ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సాత్విక వీరవల్లి బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమె అమెరికాలో జన్మించినప్పటికీ, ఆమె కుటుంబ మూలాలు తమిళనాడులోని చెన్నైకి చెందిన తెలుగు కుటుంబానికి సంబంధించినవి. అమెరికాలోని ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్, వాండర్‌బిల్ట్ యూనివర్సిటీల నుంచి ఇంజనీరింగ్ పట్టాలు అందుకున్నారు..!!

Manchu Lakshmi adopts 48 government schools!