in

Manchu Lakshmi adopts 48 government schools!

Manchu Lakshmi adopts 48 government schools!

మంచు లక్ష్మి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నడుం బిగించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నట్టు ఆమె తెలిపారు. తన ‘టీచ్ ఫర్ చేంజ్’ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని 48 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. ఈరోజు సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన మంచు లక్ష్మి..చౌటకూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు.

ఈ సందర్భంగా అక్కడ ‘టీచ్ ఫర్ చేంజ్’ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ స్మార్ట్ క్లాస్‌రూమ్‌ను ఆమె ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మాట్లాడిన లక్ష్మి..గ్రామీణ విద్యార్థుల కోసం అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. దత్తత తీసుకున్న పాఠశాలల్లో స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీలు, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, ఇతర మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు ఆమె వివరించారు. నాణ్యమైన విద్య ద్వారానే విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని, అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు తనవంతు కృషి చేస్తున్నానని పేర్కొన్నారు..!!

ramayana promotions, a new headache for sai pallavi!

Telugu girl Satvika Veeravalli onboard for rc17?