
తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన విషయాలు వెల్లడించారు. గతంలో తాను ప్రేమలో దారుణంగా మోసపోయానని, ఆ కారణంగా తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లానని ఆమె తెలిపారు. ప్రస్తుతం నయనతార ప్రధాన పాత్రలో నటించిన ‘మూకుత్తి అమ్మన్ 2’ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో ఈ వ్యాఖ్యలు చేశారు..తన గత ప్రేమ బంధం గురించి మాట్లాడుతూ..”2020లో నా జీవితంలో ఊహించని ఘటన జరిగింది. నేను ప్రేమించిన వ్యక్తి నన్ను మోసం చేయడంతో ఆ బంధం ముగిసిపోయింది.. ఆ పరిణామం నన్ను మానసికంగా కుంగదీసింది. చాలా కాలం డిప్రెషన్‌తో బాధపడ్డాను..
ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది” అని రెజీనా భావోద్వేగానికి గురయ్యారు. ఈ కష్టకాలం నుంచి బయటపడటానికి తనకు తానే సమయం కేటాయించుకోవడం ఎంతో సహాయపడిందని ఆమె అన్నారు. “ఇతరుల నుంచి ప్రేమను ఆశించే ముందు, మనల్ని మనం ప్రేమించుకోవడం చాలా ముఖ్యం” అని పేర్కొన్నారు. యువతులు లైంగిక వేధింపులు వంటి చేదు అనుభవాలు ఎదుర్కొన్నప్పుడు తమను తాము నిందించుకోవద్దని సూచించారు. బాధను మనసులో దాచుకోకుండా, నమ్మకమైన వారితో పంచుకొని ధైర్యంగా ముందుకు సాగాలని ఆమె సలహా ఇచ్చారు..!!

