in

Katrina Kaif finally Slams Postpartum Bodyshaming Trolls!

Katrina Kaif finally Slams Postpartum Bodyshaming Trolls!

కత్రినా, ఆమె భర్త విక్కీ కౌశల్ ఇటీవల అంబానీ కుటుంబం నిర్వహించిన గణేశ్ చతుర్థి వేడుకలకు హాజరయ్యారు. తల్లి అయిన తర్వాత చాలా కాలానికి ఆమె బహిరంగంగా కనిపించడంతో ఆ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమయ్యాయి. అయితే కొందరు నెటిజన్లు ఆమె ప్రస్తుత రూపాన్ని గతంలో ఉన్న రూపంతో పోలుస్తూ వ్యాఖ్యలు చేశారు. ప్రసవం తర్వాత బరువు పెరిగారంటూ విమర్శలు చేయడంతో ఈ వ్యవహారం చర్చకు దారితీసింది. కత్రినాకు మద్దతుగా పలువురు ప్రముఖులు, అభిమానులు నిలిచారు. ప్రసవం తర్వాత శరీరంలో వచ్చే మార్పులు సహజమని, వాటిని విమర్శలకు కారణంగా మార్చకూడదని అభిప్రాయపడ్డారు..

తాజాగా కత్రినా సైతం ఈ విమర్శలపై స్పందిస్తూ తన ఆలోచనలను పంచుకున్నారు. ప్రసవం తర్వాత మహిళల శరీరంలో వచ్చే మార్పుల గురించి చాలామందికి అవగాహన ఉంటుందని కత్రినా పేర్కొన్నారు. అయినప్పటికీ కొందరు అలాంటి మార్పులను విమర్శించాలని నిర్ణయించుకుంటే అది వారి వ్యక్తిగత నిర్ణయమని వ్యాఖ్యానించారు. ఇతరుల అభిప్రాయాల కోసం తన జీవితంలోని ముఖ్యమైన దశను పక్కన పెట్టబోననే విషయాన్ని ఆమె స్పష్టం చేశారు. ప్రసవం తర్వాత మహిళలు వీలైనంత త్వరగా గతంలో ఉన్న శరీరాకృతికి తిరిగి రావాలనే భావనపై కూడా కత్రినా స్పందించారు. ‘బౌన్స్ బ్యాక్’ అనే పదాన్ని ప్రస్తావిస్తూ, తన జీవితంలోని ఈ అందమైన దశను ఆస్వాదిస్తూ ముందుకు సాగాలనుకుంటున్నట్లు తెలిపారు..!!

Trisha Krishnan in talks to play Jayalalithaa in MGR’s biopic!

Aadarsha Kutumbam!