in

Nayanthara reunites with Rajinikanth after 5 years!

Nayanthara reunites with Rajinikanth after 5 years!

సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ధర్మన్’ గురించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ వెలువడింది. ఈ సినిమాలో కథానాయికగా లేడీ సూపర్‌స్టార్ నయనతార నటిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ, దర్శకుడు అశ్వత్ మారిముత్తు సోషల్ మీడియా వేదికగా ఆమెకు స్వాగతం పలికారు. దీంతో రజనీ-నయన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఆదివారం సాయంత్రం ‘ధర్మన్’ చిత్ర నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, తమ సోషల్ మీడియా ఖాతాలో “కొన్ని కళ్లు అన్నీ చెప్పేస్తాయి. ఆ తేజస్సు రాబోతోంది” అంటూ ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ఆ తర్వాత కొద్ది గంటలకే దర్శకుడు అశ్వత్ మారిముత్తు స్పందిస్తూ, నయనతారను ట్యాగ్ చేసి “మా టీమ్‌లోకి స్వాగతం మేమ్” అని పోస్ట్ చేయడంతో ఈ వార్త ఖరారైంది. రజినీకాంత్, నయనతార కాంబినేషన్ వెండితెరపై ఎప్పుడూ ప్రత్యేకమే. వీరిద్దరూ కలిసి ఇప్పటివరకు ‘చంద్రముఖి’, ‘కుచేలన్’, ‘దర్బార్’, ‘అన్నాత్తే’ చిత్రాల్లో నటించారు. ఇప్పుడు ‘ధర్మన్’ వీరి కాంబినేషన్‌లో రాబోతున్న ఐదో సినిమా కావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి..!!

finally saptami gowda signs her second telugu film!

Jikki Rejected ANR's Marriage Proposal!

Jikki Rejected ANR’s Marriage Proposal!