in

finally saptami gowda signs her second telugu film!

finally saptami gowda signs her second telugu film!

మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ వ‌రుస ప్రాజెక్టుల‌తో బిజీ అవుతున్నాడు. తేజ్ హీరోగా ‘సంబ‌రాల ఏటి గ‌ట్టు’ సినిమా రెడీ అవుతోంది. 2027 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్త‌య్యింది. ఈలోగా మ‌రో సినిమాకు ప‌చ్చ జెండా ఊపాడు. సేవ్ ద టైగ‌ర్స్ ఫేమ్ తేజ కాక‌మాను ద‌ర్శ‌క‌త్వంలో, ఏకేఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. సాయి ధ‌ర‌మ్ తేజ్ హీరో. ఇటీవ‌లే ఈ చిత్రానికి క్లాప్ కొట్టారు. త్వ‌ర‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది, ఈ చిత్రంలో హీరోయిన్ గా స‌ప్త‌మి గౌడ‌ని ఎంచుకొన్నారు. స‌ప్త‌మికి ఇది రెండో తెలుగు సినిమా. ఇది వ‌ర‌కు ‘త‌మ్ముడు’ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించింది. ఆ త‌ర‌వాత ఓ తెలుగు సినిమా ఒప్పుకోవ‌డం ఇదే తొలిసారి..!!

Payal Rajput Hits Out At Vulgar Comments and body shaming!