
ఇప్పుడు దక్షిణాది సినిమా దగ్గర వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న టాలెంటెడ్ యంగ్ హీరోయిన్ మమితా బైజు. ప్రెజెంట్ జెనరేషన్ యువతని ఇప్పుడు తనవైపు తిప్పుకున్న ఆమె నుంచి ఇటీవల వచ్చిన సంచలన హిట్ చిత్రమే ‘బెత్లెహెం కుడుంబా యూనిట్’. మోలీవుడ్ టాలెంటెడ్ నటుడు నివిన్ పౌలి హీరోగా ‘ప్రేమలు’ దర్శకుడు గిరీష్ ఎడి తెరకెక్కించిన ఈ రోమ్ కామ్ సినిమా అక్కడ రికార్డులు తిరగరాసి ఇండస్ట్రీ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమా రీసెంట్ గానే ఓటిటిలోకి విడుదల కాగా ఇక్కడ నుంచి కూడా క్రేజీ రెస్పాన్స్ ఆడియెన్స్ నుంచి ఈ సినిమా సొంతం చేసుకుంది..
అయితే ఈ సినిమా హవా ఇప్పుడు ఏకంగా కేరళ సీఎం విడి సతీషన్ వరకు కూడా వెళ్ళింది. ఆయన ఈ సినిమా చూసాక ప్రశంసల జల్లు కురిపించారు. చాలా కాలం తర్వాత ఒక మంచి సినిమా చూశానని చెప్పారు. అంతే కాకుండా సినిమా అప్పుడే అయిపోయిందా అనేలా అనిపించింది అని చిత్ర యూనిట్ అందరికీ తన కంగ్రాట్స్ తెలిపి, ఓ ఫోటో షేర్ చేశారు. అందులో ఒక బుక్ షెల్ఫ్ లో కొన్ని పుస్తకాలు ఉన్నట్టుగా వాటిలో నివిన్, మమితా బైజు అలాగే సినిమా టైటిల్ లాంటి బుక్ కూడా పెట్టినట్టు ఒక డిఫరెంట్ పోస్ట్ ని చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏకంగా సీఎం నే ఈ సినిమా మెప్పించింది అంటే ఈ చిత్రం కంటెంట్ ఎలా ఉంది అనేది అర్ధం చేసుకోవచ్చు..!!

