
ఆదివారం సాయంత్రం ముంబైలోని జుహూ ప్రాంతంలో ఫుట్‌బాల్ ఆడి ఇంటికి తిరిగి వస్తుండగా, టైగర్ ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారుపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దుండగులు నాలుగు రౌండ్లు కాల్పులు జరపగా, టైగర్ ష్రాఫ్ సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటనలో ఆయన చేతికి స్వల్పంగా గన్‌పౌడర్ గాయాలయ్యాయి. కారు డ్రైవర్‌తో పాటు సమీపంలో ఉన్న ఒక ఆటో డ్రైవర్‌కు గాయాలు కావడంతో వారిని నానావతి ఆసుపత్రికి తరలించారు..దాడి తర్వాత నిందితులు తమ ద్విచక్ర వాహనాన్ని అంధేరి స్టేషన్‌లో వదిలి పారిపోయారు. పోలీసులు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకుని, దాని నంబర్ ప్లేట్, ఛాసిస్ నంబర్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు 15 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఈ దాడికి తామే బాధ్యులమంటూ విదేశాల్లో ఉంటున్న గ్యాంగ్‌స్టర్లు అనిల్ పండిట్, హర్మాన్ సంధు..లారెన్స్ బిష్ణోయ్ గ్రూప్ పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.!!

